Saturday, April 4, 2015

కురులవైనం

అమోఘం అమోఘం 
జాలువారే యా కురులవైనం 
ఏ దేవతిచ్చిన రూప వరమో 
ఏ శిల్పకారుని కృషీ ఫలమో
హృదయమాయెను వికారం
మదిని లేచెను కలవరమ్ము
పొందలేనీ నా  జన్మ వ్యర్ధం 
తిరిగి చూస్తే జన్మ ధన్యం 
చేయజూసా చిరు యత్నం
పిలువనిచ్చా ఈల స్వరము
తిరిగి జూస్తే కాన వచ్చెను 
ముఖముకున్నా మీసగెడ్డం 
ఇంక నిలిచిఉంటే అపాయం 
అది సిక్కులుండే ప్రదేశం !
                యలమంచిలి వెంకటరమణ 

No comments:

Post a Comment