Sunday, April 5, 2015

ప్రకృతి

అందమైన ప్రకృతి, అదో పెద్ద శాస్త్రము
అనాధిగ పెద్దలకూ అదే నీతి పత్రము
మట్టిలోన మాణిక్యం,ఇదో గొప్ప సాదృశ్యం
చెత్తకొలనులో పుట్టు, కలువపువ్వు సాక్షము


అన్నీ ఉన్న యిస్తరాకు, అణిగి ఉండడం
నిండుకుండ తొణకదు,అదే కదా చిత్రము
కొలనులన్నీ కలిసి చూడు, నదులు కావడం
కడలిగలసి నదుల ఉనికి,వింతకదా మారడం



బండరాతి కొండల్లో నీళ్ళేమిటి ఊరడం !
నీటబుట్టి ఇసుకతెన్ను, నిస్సారమేగావడం
ఆరిపోవు నిప్పుకు వాయువేగ సాయము
వెలుగుతున్న దివ్వెను అదే గాలి ఆర్పటం!

వెలుగునిచ్చు దివ్వెలు చీకటిలోనుండడం
తనకుతాను కాలుతూ  వెలుగుబంచినివ్వడం
పెరగలేని పాదులు చెట్ల పైన పాకడం
ఇదేకదా జీవితం మనుషులకది సాధృశ్యం!

అందమైన ప్రకృతి అదో పెద్ద శాస్త్రము
అనాధిగ పెద్దలకూ అదే నీతి పత్రము
మట్టిలోన మానిక్యం ఇదో గొప్ప సాదృశ్యం
చెత్తకొలనులో పుట్టు కలువపువ్వు సాక్షము!!

......................య.వెంకటరమణ

No comments:

Post a Comment