Thursday, April 2, 2015

పట్టు విలాపం

కోటిపురుగులజంపి నారదీసి.
జంపుధారమళ్ళె  సాగదీసి.
సొంపునింపిజేయు పట్టుచెలము.
ద్విజుడు తాఁకదగని కటముగాదా!

తగనుజెప్పమీకు-త్రుటినిదీర్చు.
నెంతనబబుజెప్పు నీఁచుదాకన్ ?
క్రేపుజంపనట్టి దదికీర్తనేల?
కీర్తిగోర నిభునికది గప్పతగునా?!

పూష్యమంటునీకు పురుగుల్నిగప్పి
పణితనొందగోర  పాపంబుగాదా?
చీడజేసినట్టి చేలఁబునీకు
ప్రియముతగదు కాద.పరమతండ్రీ!!
..........................................

మీ
య.వెంకటరమణ( తెలుగు రచన)

చెలము = వస్త్రమము :
ద్విజుడు = బ్రాహ్మణుఁడు  :
 కటము = చచ్చినది
త్రుటి= సందేహము  :
క్రేపు = కీటకము (ఆకునుచేరిన పురుగు)
పుష్యము = పూజ లేదా పూజితం
పణిత = గొప్ప

"అనేక పట్టు పురుగులను పట్టి చంపి వాటితో చేయునటువంటి పట్టువస్త్రాలు పునీత మానవులకే ముట్టసహితముగాని హింసాయుత వస్త్రాలు కదా! మీ బిడ్డలవంటి పట్టు పురుగులను చంపిచేసునట్టి పట్టు వస్త్రాలు నీకు ప్రియమనుట తగునా పరమ తండ్రీ !!

No comments:

Post a Comment