తుపాకిగుండుకు తునాతునకలే అయ్యింది
విష్పోటంతో చెల్లాచెదురైపోయింది
ధర్జీవానికి కబురంపండి
చాకలివానిని పిలిపించండి
ముక్కలు ముక్కలు కలిపైనా
మళ్ళీ తెల్లగచెయ్యండి
ఏదేమైనా వెతకండి - ఎక్కడికైనా వెళ్ళండి!!
విజయోత్సవమది తెలియకనా?
ఎందుకు తానిటువిలపిస్తుంది?
విప్లవమంటేనేమా? వింతగబయపడుతుంది.
మనమంటేనే బయపడిపోతుంది.
మరి మరి పరుగులు తీస్తాఉంది.
ఆయుధమేదీలేదేతనకి
మరి ఎవ్వరు కాపాడాలి?
పరుగులుదీస్తుందామె
పద పద పట్టుకురండి
ప్రహరీలన్నీ మూసెయ్యండి.
పిరంగిదాడులు ఆపేయండి.
ఆత్మాహుతులకు అడ్డెల్లండి
మారణహోమంనచ్చదుతనకి
మానవహారంకట్టైనా
మళ్ళీ తీసుకురారండి.
కాగితాలపై అచ్చేయండి
కనిపించేదాకా వెతకండి
ఆనవాళ్ళను చూపించండి
అడిగినవాళ్ళకి చెప్పండి
తెల్లచీరకట్టుకుంది
ఎర్రమరకలుచూసేడుస్తుంది
'శాంతి'పేరు పెట్టుకుని
అశాంతిగతానుంటుంది
అందరు వెళ్ళి వెతకండి
ఆ శాంతినిమీరే స్థాపించండి!!
య.వెంకటరమణ
No comments:
Post a Comment