Saturday, April 4, 2015

ఏదీ నే తలచిన ఆ ఉదయం

నే తలచిన ఉదయంరాదా
నీతో లేచే సమయం లేదా
మన కలలకు వారధి లేదా 
కలవరపాటుకు సమాధిలేదా 

మముగోరే సమాజమేది
మేంగోరే సంసారమేది
హఁ.సాగే సాగరమేది
హఁ రాహీ స్థానం ఏది

కదిలించే కథలేవ్రాసా
కంపించే కవితలు వ్రాసా
విధి వ్రాసే మార్గం తెలియదు
అది తెలియక నేనన్నీ మరిచా

నిన్నే మరువాలనుకుని నే
నన్నే మరిచానోయమ్మా
కన్నులు మూస్తే భయమేలమ్మా
కలలన్నీ ఇక కలవరమేనా ॥
********

............ 20/04/1997

No comments:

Post a Comment