Saturday, April 4, 2015

నీకోసం

కన్నుల నిండిన నీయపురూపం 
కమనీయమైనా ఆచంద్రవధనం
కన్నీటికేగతి నీ స్మృతి పర్వం  
కలలోనైనా కనిపిస్తావని 
కన్నులు మూయక నేనిదురిస్తున్నా
నీ చిరుధరహాసం మధిలో నిండగ
మరి తావేదమ్మా కోరికలుండగ
ప్రేమకు వేధిక నీమధినాకే 
మధనకమేమరి నీమధి చేరక.
పెదవులు నిండిన మధుమయగీతం
మద్దుగ తాకిన చెక్కిలి చూడది
క్షవరము పెరిగెను క్షమతను మించీ.
నీకాలి అందెల మువ్వంటి పలుకులు
మరిగిన చెవులివి మరి వినకాయే
మరుమల్లె పువ్వై మురిపించి నన్ను
మరువంగ నాకింక మరి నేర్పలేవా?
మంత్రాలమారీ మాతింగునారీ
మరినేడ్వలేనింక మంచానచేరి
మాసైన పోతాను మరణాన్నిచేరి !!


                       య.వెంకటరమణ

No comments:

Post a Comment