Saturday, April 4, 2015

మబ్బు తెరలు

వెన్నెలెంత చీకటాయె మబ్బుతెరలుకమ్మగా
వెన్నెలేది కోయిలా చీకటాయె జీవితం
కోరుకున్నవారికే దూరమయ్యినేనిలా
బ్రతకాలా కలకాలం రోధిస్తూ విల విలా.
మూగబోయే నామనసు, మోడుబారెనీబ్రతుకు.
జాలిచూపు నేస్తమా, జారనీకు ప్రాణమా .
పిడికిడంత హృదయమిదీ-పిచ్చిప్రేమకోసమని
పగలురేయి ప్రగళమయ్యి, పగలనాయె తాళక.
జాలువారు కన్నీళ్ళే జాడనీది అడగంగా.
కళ్ళుకుట్టు కున్నవారే కన్నీరూ పెట్టనైరి.
కనికరమేలేని ప్రియా! కక్షగట్ట భావ్యమా?!
కన్నకలలె కరగనాయె కన్నీటీ ధారలో
కరుణజూపు నేస్తమా- కరుణించే ప్రియతమా .

                            య.వెంకటరమణ

No comments:

Post a Comment