ఎందుకు సంధ్యా నీకీ క్రోధం -సింధూరమళ్ళే కందెనె వదనం..
రక్కసులెవరని బయపడుతున్నావ్ ? రాజ్యాలేలే నేతలు వీళ్ళు .
వాళ్ళూ-వీళ్ళని చూడరు భానూ -అడ్డొస్తే తెగ నరికేస్తారు .
అంతంతమాత్రం చేస్తేగాని - అంతో ఇంతో ఆస్తులు రావు
అంతంత ఆస్తులు కావాలంటే -ఇంతేకదరా నెత్తులుగొట్ట .
నదులనుకోకవి రక్తం భాను . పారుతున్దిలా రాజ్యాయలవెంట
కులాల గొడవలు అప్పుడె పోయే - మతాల గొడవలు ఇప్పుడు పోయె .
తప్పదుకదరా వీళ్ళకి పాపం-ఏదో గొడవలు పుట్టిస్తారు-
పుట్టినవాళ్ళని చంపేస్తారు .
తెల్లవాళ్ళు ఎవరూ లేరు - మిగిలినోళ్ళు మావాళ్ళే .
నల్లదనం కోసమని తెల్ల గుడ్డ లేసారు - నల్లదనం దాచమని తెల్లవాల్లకిస్తుండ్రు .
నిన్నో మొన్నో అన్నా చెప్పే - అంతకముందే బాబా చెప్పే .
ఎందరు చెప్పిన ఏమున్దోరే -చెప్పినవాళ్ళా కంపే పోయే .
ఏడుందమ్మా కంబళి అంటే - ఎడేసామో ఆడే ఉంది .
ఏమీ చూడకు - ఎవరితోననకు .
ఏమనుకున్నావ్ నేతలు వీళ్ళు -నిన్నూ నన్నూ చంపేస్తారు .
మైమరపంటే తెలియదు కాదా?! మావాళ్ళనడిగి బాగా నేర్వు .
తెల్లారేఝాముకి సుద్ధంగా మరువు .
పడమటి కొండలు బాగున్డాయి -పొద్దున్నోద్ధువు పదరా బాబు .
రచన/..
No comments:
Post a Comment