1569
తెలుగు రచన
01/09/2017
====================
సుందరకాంతులు నవఉదయం
కొత్త వెలుగుల తేజో మయము
పక్షులు ముందే గ్రహించెనేమో
రెక్కలువిచ్చుకునెగిరెనుఎదురు
ఉత్సాహంతో ఊగెను కొమ్మలు
వీచెనులే అవి చల్లని గాలులు
కొత్తపువ్వులు రంగులు తొడిగి
ఎదురు చూపులీ ఉదయంకోసం
రంగు రంగుల హారతులవిగో
స్వాగతమిస్తూ కొత్త వెలుగుకు
నిరాశ చెందకు ఓ నేస్తం
ఆ వెలుగులు మొత్తం నీ కోసం
చీకటి తెరలను చీల్చుకునదిగో
కొంగొత్త ఉదయం నీ కోసం
శుభోదయము మంగళ మయము
ఇది నీ ఉదయం ఇది నీ ఉదయం
====================
యలమంచిలి వెంకటరమణ
No comments:
Post a Comment