Thursday, July 4, 2019

1593

1593
తెలుగు రచన
17/12/2017
=================
పదుగురు తన వెనుకుంటే
పదుగురితో తా నుంటుంటే
తను కాదోయ్ నాయకుడు
నాయకత్వ మది కాదు

ఒకరి మేలు కోరు మనిషి
మనిషి మనసు గెలుచు మనిషి
ఒకరు కొరకు బ్రతుకు మనిషి
మనుషుల్లో మహామనిషి

గుండెల్లో ధైర్యముండి
మాటల్లో న్యాయముండి
ముందడుగుగ తానుండే
వ్యాఘ్రమై నడుస్తుంటే

వెనుకాడని వేయి మంది
వెనుక జేయు జే కారము
వెనుక నడుచు అడుగుల స్వరము
నాయకత్వ మది ఒక వరము

తన స్వార్ధం మరువాలి
పరుల కొరకు బ్రతకాలి
తనదన్నది ఒకటుంటే
అదే జనం కావాలి

ఆషామాషీ ఆట కాదు
కొన బోతే కొనా రాదు
నాయకత్వ మదో గుణము
వర్ఛస్సని వేద నామము

వెనుకాడని వేయి మంది
వెనుక జేయు జే కారము
వెనుక నడుచు అడుగుల స్వరము
నాయకత్వ మది ఒక వరము
===≠=============
యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment