1753
తెలుగు రచన
18/03/2018
""'''''''''''''''''''""""""""'''''''''''''''""""""""'''''''''''''''"""""""''''''''''"""""'''''''''
హరతబూరిత అవని అందాల చందాలు
స్వర్ణ కాంతుల వెలుగు ఉదయ కిరణాలు
మకుటమెరుగని పల్లె మాఊరి అందాలు
నేలకొంగిన నింగి కీకడలి సాక్షాలు
ఎర్రబారిన పళ్ళు ఏరేరి చిలకల్లు
ఏరు వాగును జేరి ఎన్నెన్ని పుష్పాలు
యాస ప్రాసలు కూర్చి జనపదుల గీతాలు
పొద్దు గూకే వాలు పిడక తాపిన పాలు
పడతి కొప్పున జేరి పలకరించెడి పూలు
నడుము చుట్టిన కొంగు నాతి హొయలు
ముంత గట్టెడి వెంకి ముంజేతి అందాలు
మట్టిగాజుల చేయి, మెట్టు, పట్టీలు
వండివార్చిన వెంకి వంట గుమగుమలు
తడక కేసిన చీర తానాల గలగల్లు
మల్లెపందిరి సొగసు,పైన వెన్నెల్లు
మాటుగాసిన మామ వెక్కిలి వేషాలు
.
సందకాడేజూడ సద్దుమణిగిన ఊరు
సందుజూసీ మామ చిలిపి చేష్టాలు
ఊపిరాడని బిగువు, ఊసులాడే సెగలు
ఉరకలేసే మనసు నుయ్యాల జంపాలు
కోర మీసం జోరు, పట్టమంచం గోడు
పట్టు విడువని మామ కేవి పగ్గాలు
కందబారిన మోము సిగ్గుదొంతర్లు
అందమైన సీమ మా పల్లెఅందాలు!!
"""""'''''''''''''''''''""""""""""''''''''''''''''""""""""'''''''''''''''''""""'''''''''''''''""
.................యలమంచిలి వెంకటరమణ
No comments:
Post a Comment