1762
తెలుగు రచన
29/04/2018
=========================
లావణ్య రాసి, పూలా....రబోసీ
నవ్వింది నా..కై వికశించు పూవయ్...
ఈ రూపమే ఋషులు సాధించెనేమో...
ఈ కన్యకేదివిని మరచొచ్చెనేమో
నదులన్ని కలిసి స్వరమెత్తి పాడేను
శిధిలాలు సైతం మైమరచి ఆడేను
ఓచూపుతోనే మనసాగిపోయేను
ఆ నవ్వుతోనే నిదురెగిరిపోయే..ను
ఏ మాయ మంత్రాలు మంత్రించెనో....
మరి తోచదింకేమి స్తంభించెనూ...
ఏ తావినడగాలి నీజాడనూ
ఏ పూలనడగాలి నీ నవ్వునూ
ఆ మధువు మధురాల నేమడుగనూ
ఏ కొమ్మన నేజేరి నిన్నడుగనూ..
సెలయేరు చెలరేగె పరవళ్లుగా
నిశరాత్రి నిలదీసే క్షణమెల్లకా. .
మరుమల్లి గుమగుమలు మురిపించగా
ఏ మలయ ద్వీపాన్ని నేనడుగనూ
నీ కనుల తో..జే..సి నాసంతకం....
నాజూకు నయనాల ప్రణాయాంకితం
తొలిచూపుకే మనసు నీకర్పితం
ఈ కనులకలలన్ని నీకంకితమ్..నీకంకితం
=========================
...........................య.వెంకటరమణ
No comments:
Post a Comment