1763
తెలుగు రచన
05/06/2018
============================
ఎంత గుమకమీ...నేల కుసుమాలా ఈ..మాలా..
ప్రవహించే ఈ నదులా పరుగుల్లా ఈ...లీలా
ఎంత గుమకమీ...నేల కుసుమాలా ఈ..మాలా..
ప్రవహించే ఈ నదులా పరుగుల్లా ఈ...లీలా
ఏలనీనేలా.., ఏ ఋషుల వరమాలా....
యిలజారి పడెనేమో.........
స్వర్గ ముకుటమిదియేమో..
ఇదియేమో స్వర్గపీటమిదియేమో....
ఎంత గుమకమీ...నేల కుసుమాలా ఈ..మాలా..
ఈనెమలీ నాట్యాలూ,ఆ పంచీగానాలూ..
పవనాలు, కుసుమాలు ఈ ఆకాశాన హరివిల్లూ..
చలచల్లగ వీచుగాలి ఎగసిపడే కెరటాలూ...
ఎంత గుమకమీ...నేల కుసుమాలా ఈ..మాలా..
జాలువారు యేటినీరు గాలిపాటలూ
విరబూసిన పూదోటలు విరివీ..ఫలాలూ....
మల్లెల పరిమళాలు మురిపాల వెన్నియలూ...
ఎంత గుమకమీ...నేల కుసుమాలా ఈ..మాలా..
మదినితాకు పిల్లగాలి అల్లరివేషాలు..
చెల్లని మబ్బుతెరల వడివడి పయనాలూ.
ఏరువాక అలల పరుగులూ..ఎదిరీదే చిట్టిచేపలూ...
ఎంత గుమకమీ...నేల కుసుమాలా ఈ..మాలా..
============================
...... యలమంచిలి వెంకటరమణ
No comments:
Post a Comment