1776
తెలుగు రచన
07/07/2018
===================
కోకకెదిగిన చిన్నదానికి సిగ్గులొచ్చేను
తేనెలూరే తీపి భాష కనులు నేర్చేను
కొంగుచాటున ఒంపులేవో వెలుగుజూసేను
గుత్తమైనా కొత్త రైకకు బిడియమొచ్చేను
నునుపుదేరిన మేను మెరుపులు స్వర్ణమేమోను
వెన్నెలమ్మే కనులజేరి మెరుగుదిద్దేను
కలలరాణి కావ్యసుందరి ఎదుటనిలిచేను
మనసునేదో కొత్తబీజం మొలకలెత్తేను
ఈ కోమలాంగికి ఇంత అందం ఎలా వచ్చేను
కోకకెదిగిన చిన్నదానికి సిగ్గులొచ్చేను
ఈ పాడు మనసుకు పరువమెందుకు గురుతుకొచ్చేను
పసుపుపాదం దస్తవేజులు నేల వ్రాసేను
కోకకెదిగిన చిన్నదానికి సిగ్గులొచ్చేను
ఈ పాడు మనసుకు పరువమెందుకు గురుతుకొచ్చేను
కోరికెందుకు ఇంతలోనే వింతజేసేను
కోరికెందుకు ఇంతలోనే వింతజేసేను
===================+===+
యలమంచిలి వెంకటరమణ ...✍
No comments:
Post a Comment