Friday, July 5, 2019

1830

1830
తెలుగు రచన
09/03/2019
===================
నీవేనా అది నీవేనా
నా ఊహల ఆ సుందరి నీవేనా
నా మదిలో కలవరము
పెదవులపై చిరునవ్వు
నీవేనా అది నీవేనా

ఈ కన్నుల్లో ప్రసరించే
ఆ కిరణం నీవేనా
నిద్దురలో నను లేపే
ఆ స్వప్నం నీవేనా
నీవేనా అది నీవేనా

చిరునవ్వుల నగుమోము
నను వీడని  దరహాసం
నీవేనా అది నీవేనా
వేకువ ఆ  తొలి కిరణం నీవేనా

ఈ పెదవులపై కదలాడే
నా చిరునవ్వులు నీవేనా
నా నీడై నాకగుపించే
ఆ రూపం నీవేనా
మది రేగిన కలవరము
ఎదలోతుల ఆ రాగం
నీవేనా అది నీవేనా
నీవేనా అది నీవేనా
===================
తెలుగు రచన

No comments:

Post a Comment