Thursday, July 4, 2019

1841

1841
తెలుగు రచన
19/06/2019

===============================
అయోడిన్ పేరుతో లావణమమ్మేస్తున్నారు
శుద్ధి పేరుతో నీళ్ళమ్మేస్తున్నారు
క్షీరం పేరుతో విషమమ్మేస్తున్నారు
సేవపేరుతో నమ్మకాన్నే అమ్మేస్తున్నారు

సేంద్రీయమంటూ చెత్తనమ్మేస్తున్నారు
శోధనాణాళికలంటూ ఇద్రియమమ్మేస్తున్నారు
అభివృద్ధిపేరుతో కాలుష్యమమ్మేస్తున్నారు
సమానత పేరుతో సామరస్యాన్నే అమ్మేస్తున్నారు

యోగ్యతపేరుతో విద్యనమ్మేస్తున్నారు
వైద్యంపేరుతో అవయవాలమ్మేస్తున్నారు
దేవుడిపేరుతో బూడిదనమ్మేస్తున్నారు
వాళ్లే కాదు మనం కూడా అమ్మేస్తున్నాం

అగ్రగణ్యమోజులో బాల్యాన్నమ్మేస్తున్నాం
సంపాదనమత్తులో సంస్కారాన్నమ్మేస్తున్నాం
ఆశలవలయంలో నీతినమ్మేస్తున్నాం
మానవత్వమొదలి మనల్ని మనమే అమ్మేసుకుంటున్నాం

అమ్మేస్తూనే కొనిదెచ్చుకుంటున్నాం
ప్రకృతినెదిరించి ముప్పుదెచ్చుకుంటున్నాం
వ్యసనాలకుబోయి రోగాల్దెచ్చుకుంటున్నాం
వసూలుకుబోయి వడ్డీల్జెల్లించుకుంటున్నాం

కోల్పోతూనేఉన్నాం అయినా దెచ్చుకుంటున్నాం
వర్గాలపేరుతో వైషమ్యాల్దెచ్చుకుంటున్నాం
అమ్ముకుంటున్నాం,కొనుక్కుంటున్నాం
దెచ్చుకుంటున్నాం మన చావు మనమే తెచ్చుకుంటున్నాం
===============================
                           యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment