1845
తెలుగు రచన
26/06/2019
======================
ఊహలకందదు ఈ.. ప్రేమా.....
కనులకు అగుపడదీ మనసూ..
కలసిన కనులకు తెలిసిన భాష
మధురాంతకం ఇది తొలిసంతకం
!!ఊహలకందదు!!
నీ చూపు లోభాష లేమడిగెనో
ఈలోపు నామనసు నేమయ్యేనో
ఎదలోతు లోఏవో కదలాడెను
పురివిప్పి నామనసు తెగఆడెను
!!ఊహలకందదు!!
ఓకొలనులో రాయి అలలాయెను
కలకలము లోలోన మొదలాయెను
ఈశ్వాస నీపేరె వల్లించెను
కనుపాప లేనీకు ఇల్లాయెను
!!ఊహలకందదు!!
======================
*****తెలుగు రచన*****
No comments:
Post a Comment