వ్రాయాలని నాకూ ఉంది
వ్రాయడానికి బోలెడు కొత్త భావాలూ ఉన్నాయి
కానీ వ్రాయలేకపోతున్నాను.
ఈరోజు కాకపోతేే రేపనుకున్నా
ఏరోజు కారోజు ఇలానే అవుతుంది
నేను సహజంగా 6 గంటలకు మించి నిద్రపోయేవాడిని కాదు
పగలు నిద్ర అస్సలు అలవాటులేదు
రాత్రి 12 గం. ముందెపుడూ నిద్రపోలేదు
అలాంటిది,
వ్రాయాలని కలందీస్తే చాలు నిద్రొచ్చేస్తుంది
పగలు కూడా సమయం దొరికితేచాలు
నిద్రపోవాలనిపిస్తుంది.
శెలవు దొరికిన రోజు పగలు కూడా 6 నుండి 8 గంటలు నిద్ర,
మళ్లీ రాత్రి మామూలే
ఫోను మాట్లాడాలంటే చిరాకు
ఇలా ఉంది
నేను వ్రాయకపోతే వచ్చిన నష్టమేమీ లేదనుకోండి,
నిజం చెప్పాలంటే ఒక హింస తప్పినట్టే
కానీ, నాకిలా కాకూడదు కదా......!?
ఎందుకిలా అవుతుందో ఏమో
వాలిడిటీ గాని అయిపోయిందేమో అని
గ్రెస్ పీరియడ్ ఎంతుందో ఏమిటో
తెలుసుకుందామని వైద్యులను అడిగితే
నిద్రరావడం రోగం కాదు, ఆరోగ్యాలక్షణం అంటారు
ఏంటో.. నాకేమీ అర్ధం కావడంలేదు.
ఏది ఏమైనా, మీరంతా చూడ్డానికి మాత్రం రండి సుమీ
...............తె ర య వెం
No comments:
Post a Comment