Thursday, July 4, 2019

సద్దుమనిగె నూరువాడ

1830
తెలుగు రచన
08/06/2019
***************************
సద్దుమనిగె నూరువాడ షురూ షురూ గుసగుసలు
ఎందుకులే అందియలు గలా గలా గగ్గోలు
కొరాకొరా కోరమీసమా జరా చూసి నీవు జరుగుమా
కాస్తంతా చూసుకో కొత్తదసలు కాసులపేరు

ఇరుకు సందు యవ్వారం,ఎంతైనా ఇరకాటం
ఒకరికొకరు గెలవాలని ఒడిపోవు నీ సమరం
డదా దడా గుండెదడ తకధినితోమ్ తకధినితోమ్
తనివితీరనీ మనసుకు ప్రతిరోజు తొలిరాగం

ఓరకంటతో నన్నెందుకు తడిపేస్తావు
దోర దొండపండునిలా నీవు చిదిమేస్తావు
లయ తప్పని సంగీతం ఇలా సాగనీ
కడదాకా నన్ను ఇలా నాట్యమాడనీ

చందమామతో నన్ను సాగనంపుతీర్మానం
వెన్నెలమ్మతో నన్ను వెళ్ళనిచ్చు వాగ్దానం
మరిచావో ఏమోలే మరి చాలిక చాలులే
చెల్లించిన బకాయిలు తిరిగి చెల్లి పోయెనులే

లాలసాట పోరాటం ముద్దాయెను ఈ మొత్తం
చీర కొంగు దారిలో ఏరులాంటి ప్రవాహం
అగో కోడి కూసింది ఆపవయ్యా    ఆరేద్దాం
ఆనోటా ఈ నోటా అల్లరవ్వ నాపేద్దాం
****************************

............య . వెంకటరమణ

No comments:

Post a Comment