Friday, July 5, 2019

జాడలేని మనసు

జాడలేని మనసు
====================
తొలి చూపుల్లో నను దోచి
మలు చూపులో హృదయం దోచి
మరుపురాని గరుతులు నాకొదలి
ఎద లయల శృతులే మార్చి
ఎటుబోయావేమో మనసా
ఎటుజూసిన నీవే తెలుసా

ఓ ఉదయం వస్తుంది
ఆ వెలుగులు తెస్తుంది
నగుమోమున నీ రూపే
కళలై నా కగుపిస్తూ
మౌనంగా వేచున్నా నీకోసం
మారుమల్లెలు కురియగరావా

మరుపెరుగాక మరి నీవే లేక
మలయమారుతమైనా స్పర్శ
మరువలేక మరపురాక మరీ మరీ
పడేవేదన మరీ నీవు ఎరుగనిదా
ఎలానైన నను జేరవా...

తొలి చూపుల్లో నను దోచి
మలు చూపులో హృదయం దోచి
మరుపురాని గరుతులు నాకొదలి
ఎద లయల శృతులే మార్చి
ఎటుబోయావేమో మనసా
ఎటుజూసిన నీవే తెలుసా
===================
                             మాధుర్య

No comments:

Post a Comment