==========================
బాగోతాలు బయటడుతున్నాయి
భూగోతాలు బయలవుతున్నాయి
దొంగలూ దొంగలు కొట్టుకు చస్తున్నారు
ధూళి మీద పడి జనం కప్పడిపోతున్నారు
కుంభ మెరుగని జనందొక కోణం
కుంభకోణాలే మరొకళ్ళ నైజాం
మక్కెలు పడిపో యిక్కడ రైతులు
లెక్కలు తేలక వాళ్ళ ఎగబాట్లు
లెక్కల్లో వీళ్ళు మన వాళ్ళు
లెక్కేసుకుంటే వీళ్ళు మనీగాళ్ళు
పక్క దేశానికి సొరంగాలు
దోచుకెళతారు గానీ దొరలు వీళ్ళు
వీళ్ళు పంచేదంతా గేసే
అగ్గిపుల్ల మీదైతే కిరోసిన్ యపాసే
ఇంటింటికీ నీటి సరఫరా
కన్నీళ్ళు ఉచితం ఎంతైనా పంచారా
రేషన్ కార్డులు జారీ
రేషన్ ఇప్పుడు కాదు మరో సారి
పెట్రోల్ ధర బాగా తగ్గింది
ధరలు తగ్గలేదు అదేమిటో నండి
ఉచిత విద్యావిదానం
పాటశాలలు లేవు తర్వాత మీ ఇష్టం
ప్రైవేటు స్కూళ్ళు బోలెడండి
చదువు కొంటే ఎగుమతి చేస్తారండి
నిజం చెబితే నేరమండి
అందుకే నేనేమి చెప్పను ఇంక శెలవండి
పక్క దేశాల్లో యుద్దమండి
మీరు బద్రం తలుపులేసుకుని పడుకోండి !
============================
.............. యలమంచిలి వెంకటరమణ
Friday, July 5, 2019
బాగోతాలు బయటడుతున్నాయి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment