Friday, July 5, 2019

సాక్షం దాచని చీకటి నేను

సాక్షం దాచని చీకటి నేను 
కరుణే ఎరుగని ఖడ్గం నేను 
బండగ మారిన వృక్షం నేను
సుగంధమెరుగని పుష్పం నేను   
స్వార్ధం కమ్మిన సాధువు నేను 
నేనే నేనను అహంకారినే నేను
ప్రలోభాలతో పాతుకుపోయానేను 
వీరుడ్నినేను, సూరిడుడ్ని నేను
నా శవానికింత పాడైన కట్టే
ఓపిక లేని వీరుడ్ని నేను 
తరాలుతరగని ఆస్థులకైతే అధిపతినేను
ఆరడుగులకే నోచని నేను
శవాన్ని నేడు శవాన్ని నేను  !!

...............య.వెంకటరమణ

No comments:

Post a Comment