======================
నీవులేకా,నిదురలేకా,
నిశిధలోనేపక్షినయ్యాను.
తోడులేకా,నీవురాక,
మందిలో నే నొంటరయ్యాను
!! నేవు లేక !!
సుడులు తిరిగే, కడలిలోనా,
ఎగసిపడెడీ కెరటమయ్యానూ
స్వరములేనీ, వేణువయ్యీ
గాత్రమెరుగని గానమయ్యాను
!!నీవులేకా!!
కనులకింకో, కలలు రాకా
కల్లనే నే కలనుకున్నానూ
అందరుండి, ఎవరులేకా
నిశీధిలో నే మిణుగురయ్యాను
!!నీవులేకా!
మరువనైనా, మరువలేకా
మరమనిషినైనే మనుగనున్నాను
ఒక్కసారీ, వచ్చినీవు
నా చిక్కుముడులు విప్పిపోరాదే
!!నీవులేకా!
========================
రచన : యలమంచిలి వెంకటరమణ
సంగీతం :
గానం. :
No comments:
Post a Comment