Thursday, July 4, 2019

వృద్ధాప్యం వరమా? శాపమా?

1580
24/09/2017
తెలుగు రచన
(వృద్ధాప్యం వరమా? శాపమా?)
==================================
కన్నబిడ్డలే సర్వస్వమని వారి కోసం తమను మరిచి,
తమను పట్టించుకొనని బిడ్డలవలన రోడ్డున పడిన
వృద్ధులైన ఏ తల్లిదండ్రులైనా ఇలానే కుమిలిపోతారేమో కదా!!
=================================
బ్రతుకు బండిలాగి అలసిబోయి
ఎండి సల్యమైన పండు ముసలి నేను
ఎండకోర్వలేక పంచలైతిన్
బంచ నెవరు లేక ఒంటరైతిన్

సత్తువిరిగిన గాళ్ళు చచ్చుబోయే
చెందనాడి బలిమి జెెల్లిబోయే
సొంతమైన వారు చెంత చేరకాయే
అంత బ్రతుకూ నేడు పంచకాయె

వృద్ధుడెట్లు నేను నా వృద్ధి నేనెఱుగ
రోత నేడు నేను పాత మనిషిన్
పాత మనిషిని నేడు రోత నైతిన్
లోకమింతేనోయి లోక వింతేనోయి

రెక్కతొడగని పక్షి కెగుర నేర్ప
ఎగురకైతినకట ఏమరిసి నెగుర
వృద్ధుడెట్లు నేను నా వృద్ధి నేనెఱుగ
ఎగురకైతినిపుడు నా రెక్కలే విరిగె

పాత మనిషిని నేను రోతనైతిన్
ప్రీతి జనుల కిపుడు పాతనైతిన్
లోతుబోయిన కనుల వెలుగుబోయే
వెలుగు కనులు ఏవి ఎటులెగిరి పోయే

వీలైతే ఓ దేవా ఒకసారిటు పరికించు
వద్దు మాకు వృద్ధాప్యం ఈ శాపం తొలగించు
ఒక్కడైతే సరే సరి, వందల్లో విడిది రోడ్డు
వద్దు దేవా వృద్ధాప్యం,వద్దు ఈ శాపం!!
===============================
యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment