Thursday, July 4, 2019

దేశంకాదోయ్ నువ్వూ-నేను

దేశంకాదోయ్ నువ్వూ-నేను
నువ్వూ-నేనే దేశం మొత్తం
జాతికి చిహ్నం జాగ్రుతిహస్తం
జాగ్రుతి కోసం ఆత్రం,ఆత్రం!

వినిపించాయా ప్రభంజనాలు
పరుగులు తీసే ప్రచండనాలు
కళ్ళవి కావు కాగడ నిప్పులు
కాలే కడుపుల ఆకలి మంటలు!!

పదండిముందుకు పదండిపోదాం
పది పదులెందుకు పదినాళ్ళుందాం.
పొలిమేరల్లో పారీలు కడదాం
అవినీతికక్కడ  గోరీ  కడదాం!!

అంతో ఇంతో అమాస తప్పదు
అప్పుడుకాదా పున్నమికర్ధం
పున్నమికోరే జనాలకోసం
వేచుందయ్యా దేశం ! దేశం !!
..........య.వెంకటరమణ

దేశంకాదోయ్ నువ్వూ-నేను
(నువ్వూ నేనూ బాగుంటే చాలనుకుంటే కాదని నా భావం...)
పది పదులెందుకు పదినాళ్ళుందాం
అంటే ఈ అవినీతి సంకెళ్ళమధ్య కుమిలిపోతూ వందేళ్ళు బ్రతకటంకంటే అవినీతిరహితంగా పదిరోజులైనా సుఖంగా బ్రతుకుదాం అని నా భావం

No comments:

Post a Comment