Friday, July 5, 2019

1754

1754
తెలుగు రచన
05/04/2018
==============================
విరవిరబూసిందీ చిగురాకుల వసంతం
మరిమరిపూ సిందీ చిగురాకులు నీకోసం
పాడవోయి కోయిలమ్మ నాకోసం
తెల్లపంచెకట్టుకుంది వెన్నెలిలా నీకోసం

నిన్నమొన్న కన్నులిప్పిన చందమామా
వెన్నెలెలా గాస్తుందో చూడవేమ్మా
తొలిచినుకుకు పలకరించి నేలతల్లీ
ముస్తాబయ్యే పచ్చచీర ఎంతసోయగం

కొత్తకొత్త ఆశలతో లేతచిగురులూ
కొత్తవైన రంగులతో పూలగుబురులూ
ఏకమై రావాలని నల్లమబ్బులూ
వచ్చివాలి పోవాలని పిల్లగాలులూ

ఇంతలోనే తొందరేల గండుతుమ్మెదా
ఆకాశము పందిరిలు తోరణాలహరివిల్లూ
సిగ్గుమొగ్గ విచ్చుకున్న పూలబంతులూ
నీవేలేనీవేలే దాచుకున్న మకరందాలూ
=============================
................. . యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment