Friday, July 5, 2019

1755

1755
తెలుగు రచన
09/04/2018
==============================
దిగులుపడకు దీపమా జగానికే వెలుగునీవు
దిక్కెరుగని దీనులకు దారిచూపు సమిదనీవు
చీకటిలో నేననీ చింతవలదు దీపమా
లోకంలో వెలుగు చూడు ఆ వెలుగే నీవు
సుమా

ఎంత వెలుగులోనుంటే నేమి లాభమూ
ఎంత ఎత్తులో నుంటే నేమి ఘనకము
అందరాని ఆ చుక్కలదేమి భాగ్యము
అందుకు భిన్నంగా నీవు ధన్యము

ఫలాలిచ్చు వృక్షము తిననేరదు  కనీసం
నేనెందుకు కాయాలని ఆ వృక్షం అనుకుంటే
మరో మొక్క మొలిచేందుకు ఏదమ్మా అవకాశం
దిగులు పడకు దీపమా దివ్యమై వెలుగుమా

పారే నీరుచూడు నిలకడెరుగదు
నిలచిననీటికి విలువ ఉండదు
నిత్యం వీచుగాలి నిరసిస్తే సూన్యమూ
ఫలితాలను ఆశించని ప్రయాసనే దైవచిత్తమూ

మొక్కై మొలిచి విత్తు, మానై విరిగి చెట్టు
పదిమందికి నీడగా ఇల్లుగా  ఏళ్ళు నిలిచి ఉన్నట్టు
నీ అడుగులు సాగాలి, అడుగుజాడ కావాలి
దిగులు పడకు నేస్తము ఇదే బ్రతుకుకర్దము

దిగులుపడకు దీపమా అందరికీ వెలుగునీవు
దిక్కెరుగని దీనులకు దారిచూపు సమిదనీవు
చీకటిలో నేననీ చింతనేల ప్రమిదనీకు
లోకంలో వెలుగుచూడు ఆవెలుగే నీవుసుమా
==============================
......................యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment