1760
తెలుగు రచన
25/4/2018
==================
మేలుకొనెడి సమయమొచ్చే
వేగుచుక్కా వెలుగనొచ్చే
బట్ట చుట్టీ, తైలముంచి
నిప్పుబెట్టి దారులెతికే
సమయమొచ్చే,సమయమొచ్చే
వారసత్వం పీడనత్వం
నాడు తెలుపు, నేడు ఖద్దరు
తెలుపు ఖద్దరు లస్తగతము
ప్రగతినెతికే దారి దగ్ధం
గుంటనక్కల కూతలవిగో
పగటివేషం మేకలవిగో
మాయ మాటల జాలమేస్తే
మత్తు మరగక గుర్తుబట్టుము
పోతూ పోతూ మోసపోతూ
తలరాతలంటూ విసిగిపోతూ
తాతలాస్తులు పంచినట్టు
దేశప్రగతికి దారబెట్టకు
కలుపు మొక్కలు బోలెడున్నాయ్
తొలుకు పట్టే సమయమన్నాయ్
మోసగాళ్లను గురుతు బట్టే
మంచిరోజులు ముందరున్నాయ్
ఇంద్రజాలం మంత్రజాలం
పితలాటక ముగ్దభాష్యం
చూపనైతే వెండి కంచం
మెతుకులుంచరు కింద బెజ్జం
అక్రమాస్తుల దాచు మార్గం
ప్రజే శ్రేయస్సు ఎరిగి సూత్రం
దోచు సేవే వీరి ధ్యేయం
నిలువు దోపిడి ముఠా సిద్ధం
తందనానా తాననానా
ఎంత జెప్పిన శంఖమేనా
అంతగాక కొంతకయినా
చలనముండక తప్పదైనా
మేలుకొనెడి సమయమొచ్చే
వేగుచుక్కా వెలుగనొచ్చే
బట్ట చుట్టీ, తైలముంచి
నిప్పుబెట్టి దారులెతికే
సమయమొచ్చే,సమయమొచ్చే
====================
°°°°°°°య.వెంకటరమణ
No comments:
Post a Comment