Friday, July 5, 2019

1759

1759
తెలుగు రచన
23/04/2018
===============
నా మనసునకుల్లాసం
మా తలపులకో రూపం
నీవు గాక ఎవరు లేమ
మము ఓదార్చే  కౌశలము

నీ ఒడిలో ఒదిగిపోతె
యుగం గడిచి పోదా
నువ్ లాలించీ బుజ్జగిస్తే
శిలలు కరిగి పోవా

నా పెదవుల ఆత్రంగా
స్తంభించిన శ్వాసవుగా
నాదుఖం, సంతోషం
అన్నింటా నీవే నీవేగా

శిశుర్వేత్తి పశుర్వేత్తి
అన్నమయ్య అపర కీర్తి
రామదాసు భక్తి గీతి
కవిజనని కావ్య గీ...తీ...

సప్తస్వరా మధుర గీతి
సరిగమప సంగీతి
గమపదని మధురగీతి
పదనిసలే సర్వత్రి....

నా మనసుకు ఉల్లాసం
ఈ మనసుకు ఉత్తేజం
నువ్వులేని ఈ మనుగడ
ఊహలకే అతీతం.......
==================
..... య.వెంకటరమణ ✍

No comments:

Post a Comment