1758
తెలుగు రచన
18/11/2017
=================
సందడైన సందెవేళ
పొద్దుజారే మామవేళ,
కన్నె పిల్ల కొప్పునపూలు
కన్నుగీటి నవ్వులవాలు
వడివడి మేఘమాల
దారితీసె నెటో ఏమో
తారతార బిక్క మోము
మిళుకు మిళుకులదేమో
గప్పుచిప్పు గోదారము
వెండి చీర గట్టిందమ్మో
గట్టుమీద కోకిలమ్మ
కొమ్మలెక్కి పాడిందమ్మో
తుంటరిది జాజి కొమ్మ
కేమి ఏమి తెలిసేనమ్మో
తుళ్ళితుళ్ళి నవ్వసాగె
మళ్లీ మళ్లీ నన్నుజూసె
సిగ్గులెంత గప్పుకున్నా
కొంటె పైట నిలువదేమి.
కంటిమీద కునుకు లేదు
మామ కెదురు వెళ్లిందేమి!
ఎంత ఎంత ఓపాలింకా
ఎంగిలంటు దాచాలింకా
దోర దోర జామపండు
చిలక ముందు ఎన్నాళ్లింకా
ఏమో ఏమో ఏమోనేమో
నిన్నకూడా ఉందో ఏమో
కొంటె మామ కబురు దెలిసి
ఇంపుసొంపు జేరాయేమో
=================
...యలమంచిలి వెంకటరమణ.
No comments:
Post a Comment