Friday, July 5, 2019

1779

1779
తెలుగు రచన
13/07/2018
==================
ఎంత పనిచేశావు  ఇంతలోనె మరిచావు
వింత ప్రేమలోకంలో ఎంత ఆశ చూపావు
ఒంటరైపోయానే ఇంతమందిలో
కొంత నాకు ఓదార్పు  పాత గురుతులే

విరబూసే పూలు కూడ విస్తుబోయెనే
వెన్నెలమ్మ ఎందుకనీ ఎటోబోయెనే
అలునుముకున్న చీకటిలో నీవు గానక
అల్లాడే మనసుకింత ఊరటీయావే

ఎడడుగులు నడిచి నీవు ఏటో వెళ్లిపోయావు
తోడు నడుచు ఆశలో ఇచట ఉండిపోయాను
ఒక్కసారి జాడ జెప్పు వచ్చిజేరతా
ఒంటరిగా విడువకే ఇంక ఓర్వలేను నేను

ఎంత పనిచేశావు  ఇంతలోనె మరిచావు
వింత ప్రేమలోకంలో ఎంత ఆశ చూపావు
ఒంటరైపోయానే ఇంతమందిలో
కొంత నాకు ఓదార్పు  తీపి గురుతులే... తీపి గురుతులే
===================
ఇలా వచ్చింది మరినేనెం చేయను

యలమంచిలి వెంకటరమణ...✍

No comments:

Post a Comment