1782
తెలుగు రచన
15/07/2018
==================
ఇంతమంది లోకంలో
ఎంత ఒంటరయ్యాను
అంతకంత శిథిలమై
ఇంత మిగిలి ఉన్నాను
కెరటమై కడలి నీవు
ఇటురాకే చెలియలేదు
పయనించే ఓ గాలి
పరిహాషించి వెళ్ళిమాకు
ఎండమావి నీటికొఱకు
ఎంత పరుగు తీయాలి
జాలి లేని మేఘమాలా
జాడ తెలుపు రారాదా
చందమామ మోము దాచి
శుక్లపక్షమయితే నేమి
కొడిగట్టిను దీపం నాది
వెలుగు నింపుమో రవివర్మ
ఎక్కడో నక్కల అరుపు
చిక్కనీ చీకటి మలుపు
తట్టుకోలేను నేను
లెక్కలేసే శ్వాసల గడువు
పిచ్చి ప్రేమ పోతే నయము
పిడుగు పడిపోతే సాధ్యం
మన్న లేను ఇంకా నేనూ
మనసు లేని మనిషై నేను.
వమ్ము జేసిన ప్రేమను నమ్మి
మన్నలేను మనసు లేక నికనేను
నా ప్రాణమేమో ఎటుబోయిందో
ఈ గుండె ఆగిపోతే నయము
==================
యలమంచిలి వెంకటరమణ...✍
(ఇలానే ఉంటుందా ఆ బాధ)
No comments:
Post a Comment