1787
తెలుగు రచన
19/07/2018
==========================
తేనెవంటిదిది తెనుగు తెలుగు భాష
శాతవాహన సప్తపదిలో పరిమళించిన భాష
మేటి చరిత గల్గి మన్ననొందిన భాష
కృష్ణమ్మ గోదారి గలగలల మన భాష
అజ్ఞాతయుగమందే తత్వమొందిన భాష
సారసత్వమందు శాశనముల భాష
మోళిగయ్య,భీమకవుల మేలి సాహిత్యభాష
సాగిపోయే సరళ సాహిత్యమీ భాష
దేవభాషా ప్రియులు శ్రేయమంటూ అపుడు
సాహిత్యమం'దంతస్థానమీయకున్నా
తన తీపి రుచిచూపి వెలిగిందెనీ తెలుగుభాష
ఇది తెనుగు భాష నా తెలుగుభాష
నాటి 'నాగంబు' నుండి నాటి ఈ కలము వరకు
నాని ఎదజల్లేనే సొగసు ఈ తెలుగుభాష
ఐదు వేలకు మించి శుద్ధ పదములుండ
సొంత పదములేల సొట్ట బెట్టనీ భాష
మౌర్య లిపికి పుత్రి నా తెలుగు భాష
వేల చంద్రులు చేరి వరసబారిన తీరు
వర్ణమాల వరము మన తెలుగుదేను
తేనెవంటిదిది తెనుగు తెలుగు భాష
ఇంత చరిత గలది మన తెనుగు భాష
కెంపు ఇది మనసుకింపు, చేయొద్దు కంపు
భక్షించు మనదొరలు కోకొల్లలున్నారు
పరభాష మోజులో మన భాష మరిచేరు
నత్తిటిభాషలు నేడు పేషనయ్యెను చూడు
పరులె నయము ఇపుడు మన భాషనెంచేరు
పరభాష లికనైన సాగనంపన్ జూడు
మన భాషలో ఇంపు మరి ఉండదదిజూడు
రక్షించ రాకుంటె రక్షించకండి
భక్షించనైతే ఎగబాకకండి
రక్షించ రాకుంటె రక్షించకండి
భక్షించనైతే ఎగబాకకండి
==========================
యలమంచిలి వెంకటరమణ.. ✍
No comments:
Post a Comment