1812
Telugu Rachana
13/11 2018
==============
నింగి నమ్మలేకుంది
నేల విస్తుబోతోంది
నీవులేని నన్నుచూసి
గాలి మూగబోతోంది
పూలు వాడిపోతుంటే
వెన్నెలారీ పోతుంది.
వేదనలో నన్నుచూసి
పున్నమెటులో పోయింది
తనువు తాళలేకుంది
బ్రతుకు భారమౌతోంది
నీవులేని దుఃఖంలో
ఊపి రాడకయ్యింది
శాపమేమి తగిలిందో
విరహమొకటే మిగిలింది
ఓదార్పుకు నీవు లేక
కంటిధార ఆగకుంది
నింగి నమ్మలేకుంది
నేల విస్తుబోతోంది.
నీవులేని నన్నుచూసి
గాలి మూగబోతోంది
==============
య.వెంకటరమణ....✍.......😭. .😃
No comments:
Post a Comment