1789
తెలుగు రచన
21/07/2018
=================
వీచే గాలికి ఆహ్వానం
వెన్నెల కాంతికి సింహద్వారం
ఉవిధ కన్నుల విహారయానం
వెలుగు తెరలకు ఉదయస్వాగతం
నవ్యోదయ తొలి పరిచయం
నవ్యోత్తమ ఉత్సహభరతం
తొలి సంధ్యా గీతాలాపం
ఉషోదయపు ఉజ్వలద్వారం
గవాక్షం,వేచిజూసే మగువనురాగం
గవాక్షం,సాగనంపే ప్రేమసాక్షం
మగువ మల్లెలకు వెన్నెలపరిచయము
రెపరెప కన్నుల కిటికీవైనం
=================
యలమంచిలి వెంకటరమణ....✍
No comments:
Post a Comment