Friday, July 5, 2019

1792

1792
తెలుగు రచన
23/07/2018
=========================
ప్రసారమాద్యం పట్టాలు తప్పింది
పార్టీ యుద్దాలకు వేదికగా మారింది
పక్షపాత వైఖరి పదేపదే కనిపిస్తోంది
తెల్లవారితే రక్తపాతమే అగుపిస్తోంది

మందుకొట్టి మోటారు కిందపడితే
ప్రజలకందులో ఒరిగే దేముంది
పదే పదే చూపిస్తే హృదయమే విధారమౌతోంది
వృధా కాకపోతే ఇలాంటివెందుకండి

పేదవాడి బ్రతుకు బజారుకొస్తుంది
పెద్దోడి సరుకు అటకలెక్కుతోంది
ప్రజల ముందు తీర్పు బాగానేఉంది
బడాబాబుల బాగోతాలకు తెరవేస్తోంది

కొత్త కొత్త నేరాలు తెరకెక్కిస్తుంది
కొత్తగా చేసేవాడికి పనికొస్తుంది
మంచే లేదా ఈ  లోకంలో
మొత్తమంతా కంపే అగుపిస్తోంది

చూద్దామంటే ఆదర్శంగా ఏముంది
హత్యలెలాచేయాలో బాగానే చూపిస్తోంది
విడ్డూరం, ఒకోటి చూస్తుంటే సిగ్గేస్తుంది
ఎప్పుడొస్తుందో ఆజోన్ గుర్రమని భయమేస్తోంది

వార్తలక్కూడా పిల్లల్ని దూరం చేయాలనిపిస్తుంది
మధ్యలో వచ్చే ప్రసారాలకు మతిపోతుంది
ప్రక్క ఛానల్ లో మాత్రం ప్రత్యేకతేముంది
మీడియా ఐకమత్యం అక్కడే కనిపిస్తుంది

కెమెరాకు చిక్కిన ప్రముఖ నాయకుని బండారం
రేపు విధిగా చూడండి మా టీవీ ప్రసారం
స్క్రోలింగులో న్యూసు దుమారం లేపుతుంది
బండారమెపుడూ అగుపడలేదు ఏంటో యవ్వారం

చెడుని వెతుకుతూ మీడియా పరుగెడుతోంది
అది కాస్త మంచి వైపు తిరిగితే బాగుంటుంది
బద్మాషోళ్ళకి కాస్తయినా బుద్ధొస్తుంది
ఒకడిని చూసి ఇంకోడిదైనా మనసు మారుతోంది

వివక్షితంగా వ్యవహరిస్తే
గన్నెందుకు పెన్నే యుద్ధంజేస్తోంది
అణుబాంబుల్ని సైతం కెమెరా తిప్పికొడుతోంది
మిత్రులారా ఆ సత్తా మన మీడియాకే ఉంది
==========================
           యలమంచిలి వెంకటరమణ.. ✍

No comments:

Post a Comment