1791
తెలుగు రచన
22/07/2018
=======================
దేశానికి ధైర్యం యువత
యువతే భవితకు చేయూత
యువతే పణము ప్రగతిప్రయాణం
ఆవిర్భావం ఆవిష్కారం యువతే సర్వం
యువతర జ్యోతుల వెలిగినచోటే
వెలుగు ఛాయల ఉజ్వలభవ్యమ్
యువత నిద్దుర వద్దు సోదరా
మత్తు మరిగెడి విధ్యలొద్దురా
మద్యం మత్తున చిత్తం మరిచి
అమ్మానాన్నల కష్టం మరిచి
అబాస పాలు,రోడ్డు ప్రక్కన
శవాల బోలి శయనిస్తుంటే
వందలకొందలు మందలు గట్టి
పబ్బులు క్లబ్బులు షికారులంటూ
మద్యం మత్తున జోగుతుబోతే
రాగరజ్జవై రోడ్డున బడితే
వరాలివ్వగా దేవుడు రాడు
భవితను మార్చే దాతల్రారు
మనుగడ మొత్తం మద్యంలోనే
మాదకద్రవ్యం రాజ్యాలేలున్
అస్తవ్యస్తం దేశం మొత్తం
అందుకు యువతే విడిచిన అస్త్రం
యువతనుకుంటే సర్వం సాధ్యం
సర్వం సాధ్యం సర్వం సాధ్యం
======================
యలమంచిలి వెంకటరమణ...✍
No comments:
Post a Comment