Friday, July 5, 2019

1797

1797
తెలుగు రచన
25/08/2018
==========================
తెల్లారిపోయాకే మెలుకువొస్తుంది
ఖర్చైపోయాకే అవసరమొస్తుంది
సమయం లేనప్పుడే చావుకబురొస్తుంది
అయిపోయాకే దాని విలువ తెలిసొస్తుంది

కరంటు పోయాకే   ఆలోచనోస్తుంది
బాలన్స్ ఐపోయాకే మిస్కాలొస్తుంది
ఏమీ లేనప్పుడే ఆకలి వేస్తుంది
జండూబామ్ చూస్తూనే తలపోటొస్తుంది

వైద్యుడ్ని చూస్తేనే జబ్బు తలపొస్తుంది
తాళమేసిన ఇంటికే కన్నం పడుతుంది
గుడిముందుకు రాగానే వినయమొచ్చేస్తుంది
అప్పులోడొచ్చినపుడు పెళ్ళాం గురుతొస్తుంది

నాన్న పోయాకే ఆయన ప్రేమ తెలుస్తుంది
నే,నాన్నయ్యాకే ఆయన విలువ తెలిసింది
నొప్పి తగిలినపుడే అమ్మ గురుతొస్తుంది
గుచ్చుకున్నాకే ఆ నొప్పి తెలుస్తోంది.
==============================
యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment