1796
తెలుగు రచన
23/08/2018
================
పడిపోతే నవ్వుతారు
నిలబడితే ఏడ్చు వీరు
పరుగెడితే ఏడ్చు వీరు
నిలబడితే నవ్వుతారు
నవ్వుతుంటె ఏడుస్తారు
ఏడ్పు జూసి నవ్వుతారు
అడిగితే ముష్టంటారు
తీసుకుంటే దొంగటారు
చెప్పబోతే సోదంటారు
చెప్పకుంటే సోనంటారు
చస్తుంటే తప్పంటారూ
బ్రతకనీరు చంపేస్తారు
బలేటోళ్లు జనం వీళ్ళు
నిలబడితే నెట్టుతారు
నడుస్తుంటే లాగుతారు
బలేటోళ్లు జనం వీళ్ళు
నవ్వుతుంటే ఏడుస్తారు
ఏడ్వబోతే నవ్వుతారు
అడిగితే అతి'యంటారు
అడగకుంటే అణిచేస్తారు
ఏడుస్తూ పుడతారు
ఏడిపించి పోతారు
తనకోసం ఎక్కడలే
పరులకొరకు బ్రతుకుతారు
పరులకొరకు బ్రతుకుతారు
పరులపై బ్రతుకుతారు
బలేటోళ్లు జనం వీళ్ళు
జాగానికే జగం వీళ్ళు
≠==============≠
°°°°°°య.వెంకటరమణ
No comments:
Post a Comment