1795
తెలుగు రచన
18/8/18
=====================
మా ఇల్లు చాలా పెద్దదయ్యింది
గదులు విశాలం, మనసు ఇరుకు
బయట ప్రపంచంతో పనేలేదు
పేద్ద ప్రహారీ, చుట్టూ కంచె
మా ఇల్లు చాలా పెద్దదయ్యింది
గదులు చాలా విశాలం,
వెతుక్కోవాలంటే చాలా కష్టం
మూడేసి మొబైళ్ళు,గోడకు టీవీలు
గతం మతికి రావాలంటే చాలా కష్టం
ఆరోజు నాకింకా గురుతుంది
అదే విశేషం వాట్సాప్ ఈ రోజుల్లో
అది నాకింకా గురుతుంది
అర్ధరాత్రి పొరమారి నానమ్మ దగ్గు
అర్ధరాత్రి పొరమారి నానమ్మ దగ్గు.
ఇల్లు ఇల్లంతా గుమిగూడిన అట్ఠాసం.
ద్వని దాటని గోడల పటిష్టం
చెవిలో ధ్వని సాధనం
ఇప్పుడెలా వినబడుతుంది పాపం
మా ఇల్లు చాలా పెద్దదయ్యింది
ఇప్పుడు వినిపించాలంటే చాలా కష్టం
ఎవ డరిచేతిలో వాడి ప్రపంచం
కలవడం కష్టం ఆన్ లైన్లో పలకరిస్తుంటాం
ఆన్ లైన్ ఈ రోజుల్లో కూడా
నాకు బాగానే గురుతుంది
బయటకెళ్లేప్పుడు బండి వెతికేవారు నాన్న
ఇప్పుడెక్కడికీ వెళ్లరాయన
అయినా లెక్కలేస్తుంటారు బళ్ళాయన
ఇంట్లో ఉనికి తెలియదు మరి
బయటకెవరెళ్ళారో బళ్లు చూసే ఇక తెలియాలి
ఎవరున్నారో ఎవరు లేరో ఎలా తెలుస్తుంది
మా ఇల్లు చాలా పెద్దదయ్యింది
వంటగదిలో ఆమె వంట చేస్తుంటే
కొంటెపాటల నాకు, ఇంచక్కా అగుపించేదామె
రొశ రొషలామె మిసమిస నవ్వులు
ఇంక ఇప్పడెలా కనిపిస్తుంది
మా ఇల్లు చాలా పెద్దదయ్యింది
ఏమీ కనిపించదు, ఎవరూ అగుపించరు
మా ఇల్లు చాలా పెద్దదయ్యింది
అనుబంధాలకు మరీ ఇరుకయ్యింది
నాన్న ఫోటో హాల్లో కొచ్చింది, బయట కుక్క ఇంట్లోకెళ్లింది
మా ఇల్లు చాలా పెద్దదయ్యింది
పెరట్లో మొక్కలు ఇంట్లోకెళ్ళాయి
ఇంట్లో కుర్చీలు పెరటికొచ్చాయి
మా ఇల్లు చాలా పెద్దదయ్యింది
పర్వాలేదు పలకరింపులు బాగానే ఉన్నాయి
ఎదురుగా వస్తే ఏమీలేదు, ఆన్ లైన్లో అన్నీ వస్తున్నాయి
అమ్మాయి అబ్బాయి పక్కరూములోనే ఉంటారు
పర్వాలేదు అప్పుడప్పుడు అగుపిస్తుంటారు
పొద్దున్నే గుడిమీద సుప్రభాతం
తులసికోట ప్రదక్షిణం
చిత్రం ఇది మరీ బాగుంది, మొబైల్లో వెస్ట్రన్ శ్లోకం
బటన్ నొక్కితే తులసికోట అదే బ్రమణం
మా ఇల్లు చాలా పెద్దదయ్యింది
ముగ్గులు అటకెక్కాయి
నేలలు నునుపెక్కాయి
పవిటలు ముఖమెక్కాయి
పవిటలు ముఖమెక్కాయి
కల్లాపులు కంపయ్యాయి
దీపంలో తైలం పొగసూరు కంపు
మొబైల్లో మంత్రాలు, స్విచ్చేస్తే దీపాలచెల్లింపు
మా ఇల్లు చాలా పెద్దదయ్యింది
కాలింగ్ బెల్ మ్రోగి చాన్నాళ్లయ్యింది
మొబైల్ బెల్ ఆగేదా ఏంటి
అంటూనే ఉంది గల్ గల్
ఇల్లు కాస్త పెద్దదే అయ్యింది
అనుబంధాలు బాగా ఇరుకయ్యింది
ఇల్లు కాస్త పెద్దదే అయ్యింది
అనుబంధాలు బాగా ఇరుకయ్యింది
=≠===+==============≠===
Yalamanchili Venkataramana
No comments:
Post a Comment