పుత్రశోకంతో దుఃఖిస్తుందేమో నా తల్లి
ఓ రత్నాన్ని కోల్పోయి విలపిస్తుందేమో ఆ తల్లి
అజాత శత్రువు తన బిడ్డకై
బోసి నవ్వుల ఆ రారాజుకై
గుండెలు బాదుకు నేడుస్తుందేమో
ఏడుస్తుందేమో ఆ తల్లి నా తల్లి
భారత రత్న అటల్ బిహారిని
కోల్పోతూ ఆ తల్లి, నా తల్లి భరతమాత
ఏడుస్తుందేమో ఏడుస్తుందేమో
ప్రతికన్నూ ఏడుస్తూనే ఉందేమో
మేఘమాలా రారాజుకు, దారివ్వూ మా రాజుకు
ఆకాశం అడ్డుతొలగు, స్వర్గానికి తలుపుతెరువు
అవిరామా నాయకుడు, పవళిస్తాడనుకుంటా
పవనామా పాటపాడు, సుగంధాలు తెచ్చిపరువు
శత్రువు గుండెల్లో వాహనాలు నడిపించిన
ఆటల నిర్ణయ జటిల నేతకు
ఆ దేవతలే స్వాగతమిస్తున్నారేమో
స్వాగతమిస్తున్నారేమో ఆ కవిరాజుకు
స్వాగతమిస్తున్నారేమో మా రారాజుకు
స్వాగతనిస్తున్నారేమో నేతృత్వం నేర్పించే ఈ రాజుకు
ఎప్పటికీ చెరిగిపోవు ఆ చిరునవ్వులు
ఎప్పటికీ మరపురావు మృదు బాషణలు
ఎప్పటికీ మరి రారు మా రాజుకు సరి రారు
అటల్ బిహారి అమర్ రహే
No comments:
Post a Comment