Friday, July 5, 2019

1800

1800
Telugu rachana
19/09/2018
=================================
ఒంటరిగా వెన్నెల్లో ప్రియా నీవు నిలిచుంటే
స్వర్గం నుంచెవరైనా నిన్ను తొంగి చూస్తారు
దేవకన్యకేమోనని వచ్చి తీసుకెళతారు
నను నచ్చజెప్పమంటారు అప్పజెప్పమంటారు

నా వాకిట నిను చూసిన వా రెవరైనా అంటారు
మతిభ్రంశంచెందాడు బంగారం రాసిపోసి వాకిట్లో వదిలాడని
కదులుతూ కనిపిస్తే ఖచ్చితంగా అడుగుతారు
పాలరాతి శిల్పానికి ప్రాణమెలా వచ్చెనని

నువ్వజ్రమెప్పుడు దరియించకు హృదయపు రాణీ
చిన్నబుచ్చుకుంటుందది మేను మెరుపు చూసిమరి
నువ్వు తేరబారి చూడకలా ఆకాశాన్ని
వెన్నెలమ్మ నిన్నుజేరు చందమామని

కవుల కంట పడకు నీవు కమలాక్షీ ప్రేయసీ
కావ్యాలే వ్రాస్తుందురు పగలు రాత్రి నిన్నుజూసి
ఉన్నపాటునెవరైనా వచ్చి నిన్ను జూసి
వరాలడుగుతారేమో తమ దేవత నీవనీ

అప్పుడప్పుడు బ్రహ్మ కూడా అంటాడేమో
ఇంతందం ఈమెకే ఎలా వచ్చె నేమిటనీ
అందరూ అంటుంటే నేనూ విన్నా
ఇంతందం ముందెపుడూ చూడలేదని, చూడలేమన
==================================
                                       య వెంకటరమణ....✍

No comments:

Post a Comment