1799
తెలుగు రచన
18/09/2018
====================
గాలిలా ఎగరాలని ఉంది
వెన్నెలై గాయాలని ఉందీ
గగనమా విహరించాలనివుంది
జాబిలై నాకుండాలని ఉందీ
పుష్పమై వికాశించాలని ఉంది
ఫలమునై మధువొలకాలని ఉందీ
తుమ్మెదై విహరించాలని ఉంది
మధువునై పెదవంంటాలని ఉందీ
ఉదయమై నిను లేపాలనివుంది
అద్దమై నిను చూడాలని ఉందీ
చినుకునై నిను తడపాలనివుంది
చవిటనై నలుగంటాలని ఉందీ
అద్దమై ఎదురుండాలని ఉంది
కాటుకై కళ దేవాలని ఉందీ
వస్త్రమై నిను గప్పాలని ఉంది
నీడలా వెనుకుండాలని ఉందీ
ఉండాలని ఉందీ, నాకుండాలని ఉంది
నీ ఆశా, నీ శ్వాసా, నీ సర్వం నీనై నీకు
నా ప్రాణం ఈ సర్వమ్ నీ కోసం నేనవుతూ
ఉండాలని ఉంది నాకుండాలని ఉందీ
==========================
యలమంచిలి వెంకటరమణ.....
No comments:
Post a Comment