జోల పాడుతు నిద్దరోవే చిట్టి మనసా
పీడ కలలవి తుళ్ళి పడకే నువ్వు మనసా
జోల పాడుతు నిద్దరోవే చిట్టి మనసా
పీడ కలలవి తుళ్ళి పడకే నువ్వు మనసా
చరణం:
మాయదారీ దేవుడేందుకు మనసునెకడో లోపలుంచాడు
మదనపడమని మనిషికెందుకు వేదనిచ్చాడు
అన్నికన్నీ అన్నీ ఇచ్చి, మనసు మాత్రం ఒక్కటిచ్చాడు
మరిచిపోతే మాసిపొమ్మని శాపమెందుకు మనిషికెట్టాడు
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° ||పల్లవి||
చరణం:
ఎవరికెవరే వెర్రి మనసా ఎవరికొరకీ దిగులు మనసా
నిన్ను కాదని వెళ్లినాక దిగుల నీకా పిచ్చి మాలోకం
మాసిపోతే తిరగనేర్చి మనసు వరకూ నిన్ను రానీరే
మలుపు తిప్పి తెడ్డివెయ్యి మరులుగొలిపే రాగమెత్తోయి
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° ||పల్లవి||
No comments:
Post a Comment