1802
TELUGU RACHANA
21/10/2018
==================
అదిగదిగో తెలవారింది
నీ నీడదిగో వెనకకు మల్లింది.
పద పదయని నిను నెడుతోంది
వెనుదడుతూ తొలికిరణం
ఎగసెగసిన కెరటాలవిగో
ఆత్రంతో నిను జూస్తున్నాయి
తన వంతుగ పవనం సైతం
పద పదయని నీ వెనుకుంది
ఆకాశం మబ్బులు తొలగి
తొలికిరణం నీకై పరిచి
కుసుమాలా తివాచి పరిచి
నీ గమ్యం చూపిస్తుంది
వెనుదిరుగకు మరి ఆగకు
ఆ వెలుగులు నీవయితే
మా భవితలు నీవేనోయ్
ఓ యువతా నీవేనోయ్
================
.........య.వెంకటరమణ
No comments:
Post a Comment