*********** చివరి కవిత **********
========================
చివరి కవిత నేను వ్రాయనా
చివరికిదే చివరి కథౌనా
చివరి కవిత ఇదే ఇదౌనా
చివరి పాట నేను పాడనా
నా రచనే నాకు ప్రాణము
ఈ రచనే చివరి వచనము
కారుమబ్బుల చీకటిలో
కనుమరుగూ తారల్లో
ఒక తార నేను అవుతాను
జేర నిన్ను జూస్తాను
అనురాగం ఎలా పంచను
ఈ రాగం ఎలా పాడను
ప్రేమెరుగని పాషాణం
పాశమై వెంటాడితె
చివరి పాట ఇలా పాడనా
చివరి పాట నేను పాడనా
స్వరం లేని చివరి పాట
శ్వాస లేని ఈల పాట
ఎలా నీకు చేరవేయను
ఆ చేరువెలా నేను మరువను
కారుమబ్బు చీకటిలో నేనుమనగలేను
కన్నీటిసాగరాలు నేను ఈదలేను
చివరి కవిత నేను వ్రాయనా
చివరికిదే చివరి కథౌనా
చివరి కవిత ఇదే ఇదౌనా
చివరి పాట నేను పాడనా
=========================
No comments:
Post a Comment