1811
Telugu rachana
19/12/2018
================================
మృత్యువెప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు
పోయేటప్పుడు ప్రాణం కూడా చెప్పి పోదు
అందరూ ఉండాలనే అనుకుంటాం
పోతామన్నదే మనం మరచిపోతాం
మరచిపోతాం ఈ ప్రాణమో గాలిబుడగనీ,
జాలీలేని ఈ ప్రాణానికి తనవారెవరూ లేరని.
ప్రాణంబోతే పక్కనపెట్టేస్తారు, ఆనాకే బూడిదజేస్తారు
మట్టిలో మాత్రం ఎన్నాళ్ళని ఉంటాం
సమసిపోయేలోపే అంతా మరిచిపోతాం
మనకే పనికిరాదుగా ప్రాణంపోయాకీ శరీరం
ఊపిరేగా దీనికింధనం,ఊపిరుండగానే మనందరం
పదుగురికై ఉండుట కాదంటారా మన ధర్మం
పోయికా పడివుంటాం పది మనసుల్లో మనం
=============================
తెలుగు రచన
Friday, July 5, 2019
1811
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment