Friday, July 5, 2019

చిత్రమైన చందమామ కథ

చిత్రమైన చందమామ కథ
===============================
చిత్రమైన చందమామ కథే ఈ మనిషి జీవితం
అనగనగా పుట్టెనొక మనిషి
పుట్టుక చిత్రం, పోవుటచిత్రం
మధ్యనంతా ఓ చలనచిత్రం
జీవితం మొత్తం నాలుగేడుపులు ఆరునవ్వులు
ఐదుఫైట్లు మూడుపాటలు
చివరికి సంతా శుభమే
ఎన్నో బాధలు, ఎన్నెన్నో సంబంధాలు
అసలు పాశాలు తెంచుకోలేమనుకోవడం సిత్రం
రంగుల హరివిల్లులై విరసే కలలు
రాళ్లను మలచి,తొలచి ప్రయత్నించేరు గమ్యం
అయినా, రేపింకో కల,ఇంకో రాయి
చిత్రమైన ఈ జీవితం విచిత్రమాయే ఆగని ఈ పయనం
మధ్యలో మతి చెడి చేరును ఈర్ష్యా ద్వేషాలు
అందంగా మనిషి తవ్వుకొనును తనకు తానే ఓ గోయి... సిత్రమేకదా
ఓ రోజు తాను గ్రహిస్తాడేమో బహుశా
కూడబెట్టిన కోట్లు భవిషత్తు గురించి
తాను ఏర్చి కూర్చిన అవి తనతో రావని
ఆ నలుగురూ మోసి మన్ను చేసేస్తారని.
అప్పుడు తెలుసుకుంటాడేమో
చందమామ కథలో ఓ రాకుమారుడిననీ,
అంతా ఊహేనని.
చిత్రమైన చందమామ కథే ఈ మనిషి జీవితం.
===============================
                            మాధుర్య

No comments:

Post a Comment