Friday, July 5, 2019

1810

1810
TELUGU RACHANA
12/12/2018
●●●●●●●●●●●●●●●●●●●
కులాల వారీ వీధులు
వర్గాల వారీ విగ్రహాలు
వర్ణాల పేరుతో పేటలపేర్లు
కులబేధాలొద్దంటూ బేనర్లు

ఎవరు పాడినా అదేపాట
మాకోసం ఆయనది చేశారు
మాకోసం ఈయనిది చేశారు
ఇది చేద్దామని ఎవరూ అనరు

కడుపు కూటికి వ్యాపారాలు
కడుపు నిండాక అక్రమాలు
పైనుండి కష్టే ఫలి సూక్తులు
ఏమిటో మరి కోట్లు తెచ్చే ఆ కష్టాలు

కడుపు నిండాక అక్రమాలు
భూకబ్జాలు, భ్రష్టకార్యాలు.
బ్యాంకుల్లో ఉండవుగానీ డబ్బులు
ఇంటిగోడలే వాళ్లకు బ్యాంకులు

భూకబ్జాలు, భ్రష్టకార్యాలు.
కాపాడుకోడానికి రాజకీయాలు
ప్రజా సేవంటూ ప్రగల్భాలు
ఉంటే హారతులు,పోతే విగ్రహాలు
●●●●●●●●●●●●●●●●●●●
  యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment