1805
TELUGU RACHANA
01/11/2018
శ్రీమతి లలిత (గాయత్రి) గారి స్వరకల్పనతో
===========================
తీపిధారలొలుకు పలుకు ఛాందసభాష
మధురభావ సుగందమీ తెలుగుభాష
సంగీతా నాదలయకు శ్రావ్యమైన భాష
తెలుగుతీపి మధువులొలుకు మాతృభాషా
ఆది కవీ నన్నయ్యా అక్షర శ్వాసా
శివకవులు, ఎఱ్ఱన్న, తిక్కన్న భాషా
శ్రీనాధుని శృంగారపు కావ్యభాషా
రాయులోరి యుగములోన రాజిల్లిన దీబాషా
వాసుదేవచార్యులూ ఎంచుకున్న ఏకభాష
త్యాగరాజుసృతులుబలికి అన్నమయ్యగానమయ్యి
క్షేత్రాలలొ కీర్తిగొన్న క్షేత్రయ బాషా
తెలుగుతీపి మధువులొలుకు మాతృభాషా
రాజశేఖరాచరితా కందుకూరి నవలభాషా
ముత్యాలా సరాలుగా గురజాడ వా రి బాష
గిడుగువారు, కట్టమంచి రాయప్రోలు వ్రాసినభాషా
మహమ్మదు శతకంతో మైత్రి చాటినీభాషా
తీపిధారలొలుకు పలుకు ఛాందసబాష
మధురభావ సుగందమీ తెలుగుబాషా
సంగీతా నాదలయకు శ్రావ్యమైన భాష
తెలుగుతీపి మధువులొలుకు మాతృభాష
==========================
యలమంచిలి వెంకటరమణ..✍
No comments:
Post a Comment